Minister KTR: వీఆర్‌ఏల సమస్యకు పరిష్కారం చూపుతాం..
Minister KTR: వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
Minister KTR: వీఆర్‌ఏల సమస్యకు పరిష్కారం చూపుతాం..
Minister KTR: వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదని..వారంతా ప్రభుత్వంలో భాగమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం వీఆర్ఏలు అసెంబ్లీని ముట్టడికి యత్నించడంతో మంత్రి కేటీఆర్ సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి సూచన మేరకు ఇవాళ వీఆర్ఏలు కేటీఆర్‌ను కలిసి చర్చించారు. అయితే చర్చల పూర్తి సారాంశం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.