మోడీ పాలనలో సబ్‌ కా సత్తేనాశ్ : కేటీఆర్

Open Letter: పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

Update: 2022-04-06 13:13 GMT

మోడీ పాలనలో సబ్‌ కా సత్తేనాశ్ : కేటీఆర్

Open Letter: పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గొప్పలు చెప్పుకునే మోడీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే తమ పనిగా కేంద్రం పెట్టుకుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడప లేక బీజేపీ అవలంభిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమన్నారు. పన్నులు పెంచడమే పరిపాలనగా భావిస్తోందన్నారు.

దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26. 51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికి మాలిన ప్రభుత్వం బీజేపీదేనన్నారు. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంందన్నారు. పెట్రోల్ ధరల పేరిట ప్రజల జేబలును దోచుకుంటున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. పెట్రోల్ ధరల బాదుడు ఆపకపోతే ప్రజలు తిరస్కరించడం ఖామన్నారు కేటీఆర్.

Tags:    

Similar News