Jupally Krishna Rao: మళ్లీ నేను గెలుస్తానో లేదో.. మా పార్టీ గెలుస్తుందో లేదో..

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-09-12 11:09 GMT

Jupally Krishna Rao: మళ్లీ నేను గెలుస్తానో లేదో.. మా పార్టీ గెలుస్తుందో లేదో..

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో, తమ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదని, అందుకే ఎవరికీ హామీలు ఇవ్వబోనని అన్నారు. బోథన్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయమని వచ్చిన స్థానికుల వద్ద మంత్రి స్థానంలో ఉన్న జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను నా సొంత నియోజకవర్గంలో కూడా ఎవరికీ హామీలు ఇవ్వను. ఎందుకంటే మళ్లీ నేను గెలుస్తానో లేదో.. మా పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో మనకు తెలియదు" అని జూపల్లి అన్నారు. అయితే, తన వంతు ప్రయత్నం మాత్రం చేస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక సీనియర్ మంత్రి ఈ తరహాలో బహిరంగంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News