Harish Rao: సంగారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేసిన మంత్రి

Update: 2023-09-02 08:30 GMT

Harish Rao: సంగారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎప్పుడు ధర్నాలు చేస్తాయని.. ప్రజలకోసం పని చేయవని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. సంగారెడ్డిలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు హరీష్‌రావు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువన్నారు. మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం పకోడిలా ఉంటాయని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారా అని ప్రశ్నించారు.

బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్, మాగంటి గోపీనాథ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపుడి గాంధీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News