ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు : మంత్రి హరీశ్ రావు
Harish Rao: కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా 1600 పడకలు హైదరాబాద్‌లో ఏర్పాటు...
ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు : మంత్రి హరీశ్ రావు
Harish Rao: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే ప్రజలందరూ రెండో డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా 1600 పడకలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు.