మంత్రి గంగుల కమలాకర్‌కు మరోసారి కరోనా..
*మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా.. కరోనా బారినపడడం ఇది రెండోసారి
మంత్రి గంగుల కమలాకర్‌కు మరోసారి కరోనా..
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అయినా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు గతేడాది అక్టోబర్‌లో కొవిడ్ బారినపడ్డారు.
#Covid pic.twitter.com/OXodeqQoz1
— Gangula Kamalakar (@GKamalakarTRS) July 16, 2022