Gangula Kamalakar: ఎల్లుండి నుంచి కొనుగోళ్లు.. తెలంగాణ సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు..

Gangula Kamalakar: తెలంగాణలో ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.

Update: 2022-04-13 15:00 GMT

Gangula Kamalakar: ఎల్లుండి నుంచి కొనుగోళ్లు.. తెలంగాణ సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు..

Gangula Kamalakar: తెలంగాణలో ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. తెలంగాణలో పండించిన రైతులు మాత్రమే కొనుగోలు కేంద్రానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల రైతులు రావొద్దన్నారు. ఈ మేరకు ఒక్కొ కేంద్రానికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులను కొనుగోళ్లకు అనుసంధానిస్తామన్నారు. యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, వీటి సేకరణకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని వివరించారు.

1960 కంటే ఒక్క రూపాయి తక్కువకు ఎవరూ అమ్ముకోవద్దని మంత్రి స్పష్టం చేశారు. రా రైస్ కొనాలని కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి గంగుల అన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలోకి రాకుండా 51 చోట్ల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Tags:    

Similar News