Hyderabad: గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Update: 2025-05-18 04:50 GMT

Hyderabad: గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Hyderabad: హైదరాబాద్ గుల్జార్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిప్రమాద సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భనవంలో ఉన్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిప్రమాద సిబ్బంది యత్నిస్తున్నారు.

గాయపడిన వారిని ఉస్మానియా, యశోద, డీఆర్డివో, అపోలో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News