Mallikarjun Kharge: మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడ్డ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి మాట్లాడే ముందు అద్వానీ, గడ్కరీ ఎన్నిక ఎలా జరిగింది...?
Mallikarjun Kharge: మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడ్డ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి మాట్లాడే ముందు అద్వానీ, గడ్కరీ ఎన్నిక ఎలా జరిగింది...? నడ్డాకి పదవి కాలం పొడిగింపు ఎలా జరిగిందో బీజేపీ ఒకసారి ఆలోచించాలని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పక్క పార్టీలో ఏం జరుగుతుందో చెప్పే ముందు వారి పార్టీలో ఏం జరిగిందో చూడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన ఆయన చాలా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా మారాయని అయితే బయటి రాష్ట్రాల్లో ఆ పార్టీలకు చెందిన ఒక్క సీఎం కూడా లేరని అభిప్రాయపడ్డారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఈనెల 17న జరగనున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అప్పీల్ చేశారు.