Kukatpally Murder Case: కూకట్‌పల్లిలో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి - కుక్కర్‌తో కొట్టి మహిళ హత్య
Kukatpally Murder Case: కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Kukatpally Murder Case: కూకట్‌పల్లిలో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి - కుక్కర్‌తో కొట్టి మహిళ హత్య
Kukatpally Murder Case: కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో వ్యక్తితో కలిసి రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసే వంట మనిషే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మహిళ చేతులు, కాళ్లు కట్టేసి తలపై కుక్కర్‌తో కొట్టి హత్య చేశారు నిందితులు.
మహిళ హత్య అనంతరం ఇంట్లోని నగలు, నగదుతో నిందితులు పారిపోయారు. అయితే పారిపోయేందుకు సైతం యజమాని బైక్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. నిందితులు హర్ష, రోషన్ కోసం ఐదు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు.