కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ.. చేనేతపై జీఎస్టీ రద్దు, టెక్స్‌టైల్‌పై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్

KTR: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

Update: 2022-08-06 09:55 GMT

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ.. చేనేతపై జీఎస్టీ రద్దు, టెక్స్‌టైల్‌పై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్

KTR: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత పై జీఎస్టీ రద్దు చేసి, టెక్స్ టైల్స్ పై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ రంగంపై మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. టెక్స్‌టైల్, చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. అందుకే చేనేత పై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

శుష్క వాగ్దానాలు - రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతుందని మండిపడ్డారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అసత్యాలు మాని తెలంగాణ నేతన్నకు సహాయం చేస్తే మంచిదని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదన్నారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఎటూ పోయిందని నిలదీశారు. 

Full View


Tags:    

Similar News