KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది
KTR: ఐటీ రంగానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదు
KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది
KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. గత ఏడాది దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ 33 శాతంతో టాప్‌లో ఉందన్నారు. ఐటీలో ప్రత్యక్షంగా ఒక్కరికి ఉపాధి లభిస్తే, పరోక్షంగా మరో నలుగురికి ఉపాధి దొరుకుతుందని కేటీఆర్ వివరించారు. 2022-23కు సంబంధించి తెలంగాణ ఐటీ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. ఐటీ రంగానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదన్నారు.
అయినా తెలంగాణ సర్కార్ ఐటీ రంగంలో మేటిగా దూసుకుపోతోందని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ మరింత పురోగమిస్తుందని ఆయన ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ తెలంగాణలో కొలువుతీరుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్.