కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పర్యటన ముగించకుని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో అయోద్య నుంచి తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు ఆదివారం మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
కంభంపాటిని పరామర్శించిన సీఎం చంద్రబాబు
అనంతరం చంద్రబాబు పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన రామ్మోహన్ రావును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామ్మోహన్ రావు తల్లి వెంకటనరసమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులర్పించారు.