Visakhapatnam Metro Project: విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ – రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.42 వేల కోట్లతో మూడు కారిడార్లు తొలి దశలో, భోగాపురం వరకు రెండో దశలో విస్తరణ.

Update: 2026-02-12 06:27 GMT

Visakhapatnam Metro Project: విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ – రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు

అందాల విశాఖలో అదనపు హంగుగా మెట్రో పరుగులు తీయనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. విశాఖకి పలు ప్రాజెక్టులు రానున్న నేపధ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. 


విశాఖపట్నం మెట్రో కి సమగ్ర ప్రాజెక్టు నివేదికకు సంబంధించి ముందడుగు పడింది. విశాఖ ప్రాజెక్టుకు 11 వేల 488 కోట్లు ప్రతిపాదించారు. ఈక్విటీ షేర్‌లో సగానికి కేంద్రం ఓకే చేసింది. మెట్రో రైలు కొత్త పాలసీ-2017 ప్రకారం విశాఖ ప్రాజెక్టుకు మొత్తం ఈక్విటీ షేర్ 40% లో కేంద్రం 20% నిధులు సమకూర్చేందుకు అంగీకరించింది. మిగతా 20% నిధులు రాష్ట్రప్రభుత్వం పెట్టుకోవాలి. తొలిదశలో 11 వేల 498 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు అంచనా వ్యయంలో 40% ఈక్విటీ షేర్‌గా నిర్ణయించారు. మిగతా 60% నిధులు, ప్రపంచబ్యాంకుల నుంచి సేకరిస్తారు. ఇందుకు కేంద్రం హామీ ఇస్తుంది. రాష్ట్రప్రభుత్వం 30 ఏళ్లలో రుణం తిరిగి చెల్లించాలి.


విశాఖలో తొలిదశలో మూడు కారిడార్లు ప్రతిపాదించారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు, రెండోది గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు, మూడోది తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు కలిపి మొత్తం 46.23 కిలోమీటర్లలో కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. రెండోదశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కిలో మీటర్లలో మరో కారిడార్ ప్రతిపాదించారు. ఇందుకోసం 5 వేల 734 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్నందున తొలిదశలోనే కొమ్మాది భోగాపురం మధ్య కారిడార్కు కేంద్రం ఆమోదం కోసం యత్నిస్తున్నారు. మొత్తానికి విశాఖ లో మెట్రో షురూ అవడం పై హర్షం వ్యక్తం అవుతుంది.


Tags:    

Similar News