Nandyala: లైన్‌మెన్‌కు ప్రమాదం.. విధుల్లో ఉండగా షాక్!
Nandyala: నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్ట వద్ద విద్యుత్ పనులు చేస్తుండగా లైన్‌మెన్ వసంత్ కుమార్ ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
Nandyala: లైన్‌మెన్‌కు ప్రమాదం.. విధుల్లో ఉండగా షాక్!
Nandyala: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్ వసంత్ కుమార్ విధులు నిర్వర్తిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అయ్యలూరు మెట్ట ప్రాంతంలో కరెంటు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వసంత్ కుమార్ స్వస్థలం పుసులూరు గ్రామం కాగా, ప్రస్తుతం అయ్యలూరులో నివసిస్తూ గత 11 సంవత్సరాలుగా లైన్మెన్‌గా సేవలు అందిస్తున్నాడు.
ఈ ఘటనలో వసంత్ కుమార్ కాలు తీవ్రంగా కాలిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే సహచరులు అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే, కరెంట్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని వసంత్ కుమార్‌కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన ఏమిటి? బాధితుడికి న్యాయం జరుగుతుందా? అనే విషయాలు వేచి చూడాలి.