Velerupadu: తెగిపోయిన పెద్దవాగు ప్రాజెక్టును పట్టించుకోరా? సిపిఐ ఆగ్రహం

Velerupadu: 2024 గోదావరి వరదలకు తెగిపోయిన పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు.

Update: 2026-04-01 12:55 GMT

Velerupadu: తెగిపోయిన పెద్దవాగు ప్రాజెక్టును పట్టించుకోరా? సిపిఐ ఆగ్రహం

Velerupadu: 2024 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరద వలన తెగిపోయిన పెద్దవాగు ప్రాజెక్ట్ మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులతో కలిసి బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని గుమ్మడిపల్లి సమీపంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. 2024లో ప్రాజెక్టు తెగిపోయిన నేటికి పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించటం సరైన చర్య కాదన్నారు.

వేల ఎకరాల భూమి ఆధారపడి ఉన్న ఆ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వలన రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని సుమారు 20వేల ఎకరాల భూమి ఆ ప్రాజెక్టుపై ఆధారపడి ఉందన్నారు. రెండు పంటలు పండే భూములు సైతం వర్షాధార భూములుగా మారాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.

సిపిఐ ఆధ్వర్యంలో అనేకమార్లు రైతుల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సమన్వయం అయ్యి ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ ఆధారమైన విలీన మండలాల ప్రజలకు ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనది అన్నారు. పంటలు పండించకపోవడం వలన వ్యవసాయ కూలీలకు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి మరమత్తు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రసాద్, మండల కార్యదర్శి బాడిశ రాము, జిల్లా సమితి సభ్యులు పిట్ట వీరయ్య, తాటి దుర్గారావు, సల్వా రవి, జగ్గవరపు ముక్కంటి, సాయిల కృష్ణార్జునరావు, గోస వెంకటేశ్వరావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News