Pawan Kalyan: ఏపీ అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మార్క్ స్పీచ్.. గంటల వ్యవధిలోనే రోడ్ల మంజూరు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

Update: 2026-02-13 07:18 GMT

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని, అది వింటుంటే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మాటలను వింటున్నట్లుగా అనిపించిందని పవన్ ప్రశంసించారు.

కేంద్ర సహకారం - ఎన్డీయే నిబద్ధత:

రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని, ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సామాజిక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని, అన్ని వర్గాలకు పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామని చెప్పారు.

విద్య మరియు కౌలు రైతుల సంక్షేమం:

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పవన్ వివరించారు.

ప్రతి విద్యార్థికి సంబంధించి 'తల్లికి వందనం' వంటి పథకాల ద్వారా నిధులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయని తెలిపారు.

'మెగా పేరెంట్ టీచర్ మీటింగ్' విజయవంతం కావడం మరియు మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని పేర్కొన్నారు.

కౌలు రైతుల కష్టాలు తమకు తెలుసని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భివృద్ధిలో వేగం - గంటల వ్యవధిలో నిర్ణయాలు:

గతంలో నిలిచిపోయిన ప్రమోషన్లను ప్రస్తావిస్తూ, జిల్లా పరిషత్ (ZP)లో చాలా ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎంత వేగంగా ఉందో వివరిస్తూ.. "మా గ్రామంలో రోడ్లు కావాలని ప్రముఖులు సైతం నన్ను అడిగారు. వారి విజ్ఞప్తి మేరకు గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేశాం" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఆయన పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News