పవన్‌ కల్యాణ్‌ను కలిసిన బాలయ్య.. హిందూపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్

Pawan Kalyan-Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.

Update: 2026-02-12 09:33 GMT

Pawan Kalyan-Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్‌ కల్యాణ్‌ ఛాంబర్‌కు వెళ్లిన బాలయ్య, ఆయనతో కాసేపు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

తన నియోజకవర్గమైన హిందూపురంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలను పవన్‌ దృష్టికి బాలకృష్ణ తీసుకెళ్లారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇదే సమయంలో పవన్‌ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ వ్యవహారాలపై వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా డిప్యూటీ సీఎంను కలిసి తన నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు అగ్ర హీరోలు ఇలా అసెంబ్లీ వేదికగా కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇరువురు నేతలు చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపించింది.

Tags:    

Similar News