Kurnool: మున్సిపల్ కమిషనర్‌పై ప్రభుత్వ విచారణ
Kurnool: కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Kurnool: మున్సిపల్ కమిషనర్‌పై ప్రభుత్వ విచారణ
Kurnool: కర్నూలు నగరంలో తాము పనిచేసిన పనుల బిల్లును కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ క్లియర్ చేయడం లేదని ఆయనపై విచారణ జరపాలని కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేశారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు కమిషనర్ విశ్వనాథ్ పై ఇద్దరు ఆర్డీలు
అధికారులను నియమించి విచారణ చేపట్టింది.ఇద్దరు అధికారులు బిల్లు పెండింగ్ పై కాంట్రాక్టర్లును అధికారులను విడివిడిగా విచారించారు.మున్సిపల్ కమిషనర్ ను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆర్డీ తెలిపారు. ఆరు నెలల నుంచి తమ బిల్లు కమిషనర్ చేయడం లేదని 22కోట్లు తమకు రావలసి ఉందని కమిషనర్ మాత్రం కేవలం కొంత మంది బిల్లులు మంజూరు చేశారని మరి మిగతా కాంట్రాక్టర్లు బిల్లు ఎందుకు చేయడం లేదని కాంట్రాక్టర్ ప్రశ్నిస్తున్నారు.నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మనోహర్ రెడ్డి,సుల్తాన్,శివారెడ్డి, వీరేశ్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.