KTR: దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి,.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది
KTR: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
KTR: దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి,.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది
KTR: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 9ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం గుండు సున్నా మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. 55ఏళ్లుగా దేశానికి ఏం చేయని కాంగ్రెస్.. మరోసారి ఒక్కఛాన్స్ అంటూ ప్రగల్భాలు పలుకుతుందన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.