KTR: కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని బయటపెట్టాలి

KTR: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయంతో.. కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపడిందన్న కేటీఆర్

Update: 2024-01-26 06:59 GMT

KTR: కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని బయటపెట్టాలి

KTR: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై.. గవర్నర్ తమిళిసై నిర్ణయంతో కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపడిందని ఆరోపించారు. ఢిల్లీలో ఎలాంటి చర్చ జరిగిందో తెలియకున్నా.. రేవంత్‌, అమిత్‌షాను కలవగానే.. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వేరుగా జరిగాయన్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ వస్తే. బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కేదని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని బయటపెట్టాలన్నారు.

Tags:    

Similar News