KTR: కామారెడ్డిలో ఎవరు పోటీకి వచ్చినా.. గంప కింద కమ్ముడే
KTR: ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్‌లో చేరి కాళికా మాత అంటున్నారు
KTR: కామారెడ్డిలో ఎవరు పోటీకి వచ్చినా.. గంప కింద కమ్ముడే
KTR: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే విపక్షాలకు వణుకు మొదలైందన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా బిక్కనూర్, రాజంపేట్ మండలాల నేతలతో సమావేశమైన కేటీఆర్.. కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్ పోటీ చేస్తు్న్నట్టు తెలిపారు. కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టినట్టే అని... కామారెడ్డిలో ఎవరు పోటీకొచ్చినా గంప కింద కమ్ముడే అన్నారు కేటీఆర్. ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి... ఉద్యమ గడ్డ కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేస్తానడం హాస్యాస్పదమన్నారు.