Kishan Reddy: శాంతిని ప్రసాదించిన ఘనత మోడీదే

Kishan Reddy: దేశాన్ని రక్షించేందుకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారు

Update: 2024-04-07 09:47 GMT

Kishan Reddy: శాంతిని ప్రసాదించిన ఘనత మోడీదే

Kishan Reddy: దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి... శాంతిని ప్రసాదించిన ఘనత మోడీదే అని, దేశ సరిహద్దుల్లో ‌ఎండనక.. వాన అనక.. మహిళా సైనికులు రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారని, దేశాన్ని రక్షించేందుకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. త్రిబుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకొచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారన్నారు.

దేశాన్ని అన్ని రంగాల్లో అద్భుత ప్రగతికి కృషి చేస్తున్న మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారాయన... సికింద్రాబాద్ లోకసభ పరిధిలోని మధురానగర్‌లో క్షత్రియ సమాజ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 13 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారని చెప్పారు.

Tags:    

Similar News