అంబర్ పేట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర.. అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం..
Kishan Reddy: తమ సమస్యలను కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చిన స్థానికులు
హైదరాబాద్ అంబర్ పేట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..తన సొంత నియోజకవర్గమైన అంబర్ పేటలో ఇవాళ పాదయాత్ర చేశారు. పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. స్థానికులు తమ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పాదయాత్రలో స్థానిక అధికారులు అందుబాటులో లేకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. సమస్యల పరిష్కారం కోసం తాము ప్రజల్లో తిరుగుతుంటే మీరెక్కడ? అంటూ ప్రశ్నించారు. వెంటనే కరెంటు సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. ఇక్కడ స్థానిక ఎంపీ తిరుగుతుంటే అధికారులకు సమాచారం ఇచ్చిన కూడా అధికారులు రాకపోతే ఎలా? అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పైప్ లైన్ కోసం తీసిన కాలువలు గుంతలుగా మారడంతో రోడ్డుపై నడవలేకపోతున్నామని స్థానికులు కిషన్ రెడ్డికి వివరించారు. బస్తీల్లో వాటర్ పైప్ లైన్ కోసం రోడ్డు మధ్యలో తీసిన కాలువలను వెంటనే లెవలింగ్ కిషన్ రెడ్డి అధికారలను ఆదేశించారు.