Kishan Reddy: భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద కాంగ్రెస్‌ నేతలంతా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తీరుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-09-16 11:51 GMT

Kishan Reddy: భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద కాంగ్రెస్‌ నేతలంతా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తీరుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ CWC సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన మండిపడ్డారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద కాంగ్రెస్‌ నేతలంతా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. సెప్టెంబర్‌ 17 ఏ విధంగా సమైక్య దినం అవుతుందో కేసీఆర్‌ చెప్పాలని కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణపై బీఆర్ఎస్‌కు అభిమానం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News