Harish Rao: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం..
Telangana Elections 2023: మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Harish Rao: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం..
Telangana Elections 2023: మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే నాయకులే కావాలి.. ఆడంబరాలకు పోయి హడావుడి చేసే నేతలకు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ రావు సూచించారు. బాలింతల ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కాయన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నం దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఉపయోగపడేలా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 7.50 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు.