CM KCR: తెలంగాణలో మరోసారి కంటి వెలుగు కార్యక్రమం
Kanti Velugu: తెలంగాణలో మరోసారి కంటి వెలుగు కార్యక్రమం అమలు కానుంది.
CM KCR: తెలంగాణలో మరోసారి కంటి వెలుగు కార్యక్రమం
Kanti Velugu: తెలంగాణలో మరోసారి కంటి వెలుగు కార్యక్రమం అమలు కానుంది. జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. కంటి వెలుగుతో పాటు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు వైద్యరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ఇతర శాఖల మంత్రులు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది.