HYDRA Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

HYDRA Police Station: హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోంది. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పీఎస్‌ను ప్రారంభించనున్నారు.

Update: 2025-05-02 12:18 GMT

HYDRA Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

HYDRA Police Station: హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోంది. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పీఎస్‌ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు కబ్జా కాకుండా వాటిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా వచ్చి రాగానే.. పలు ప్రాంతాల్లో పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. పలు చోట్ల అక్రమకట్టడాలను హైడ్రా కుప్పకూల్చింది.

హైడ్రా పీఎస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు భారీగా వచ్చే అవకాశం ఉంది. గతంలో వేరే పోలీస్ స్టేషన్లలో నమోదైన కబ్జా కేసులు కూడా హైడ్రా పోలీస్ స్టేషన్‌కు బదిలీ కానున్నాయి. చెరువులు, కుంటలు, భూముల కబ్జా కేసులు ఇక నుండి హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే నమోదు కానున్నాయి.

Tags:    

Similar News