Hydra: వారికి ఈ ఆదివారం వరకు హైడ్రా డెడ్ లైన్

Update: 2025-03-04 01:30 GMT

Hydra: హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంపై హైడ్రా ఫైర్ అయ్యింది. ఆదివారం లోగా ఆయా ఏజెన్సీలు అనుమతి లేని హోర్డింగ్స్ తొలగించాలని లేదంటే చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా కార్యాలయంలో అవుడ్ డోర్ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశం అయిన రంగనాథ్ అక్రమ హోర్డింగుల తొలగింపులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

హోర్డింగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం 20 నుంచి 30కోట్లు మాత్రమే వస్తున్నట్లు గణాంకాలు చెబతున్నాయని తెలిపారు. హోర్డింగుల ద్వారా ఆదాయం పెరగడమే హైడ్రా లక్ష్యమన్నారు. ఆదివారం వరకు గడువు ఇవ్వడాన్నిస్వాగతించిన ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే దానికి కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేాయి.

ఈ సందర్భంగా తెలంగాణ అవుడ్ డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో హోర్డింగులను కూడా తొలిస్తున్నారన్నా ఫోన్ కాల్స్, అపోహలు రావడంతో తాము హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా మున్సిపాలిటీలకు పన్నులు చెల్లించని హోర్డింగులు మాత్రమే తొలగిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అక్రమంగా పన్ను చెల్లించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్రమంగా ఉన్న హోర్డింగులపై మాత్రమే చర్యలు ఉంటాయని కమిషనర్ చెప్పినట్లు తెలిపారు. అక్రమ హోర్డింగుల తొలగింపుతోపాటు నూతన విధానాలను అనుసరించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. హోర్డింగులకు సంబంధించి రూపొందించనున్న కొత్త విధానాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News