Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో 30 కోట్ల విలువైన వజ్రాభరణాల స్వాధీనం

Update: 2020-10-04 06:54 GMT

Shamshabad Airport : చాలా సినిమాల్లో వజ్రాలను, మాదక ద్రవ్యాలను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు స్మగ్లర్లు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులకు దొరకకుండా ఉండేందుకు వజ్రాలను, మాదక ద్రవ్యాలను, బంగారాన్ని దాచేందుకు స్మగర్లు నానా తంటాలు పడతారు. వాటిని కొరియర్ బాక్సుల్లాగా పార్సిల్ చేయడం, నోటితో మింగి కడుపులో దాటిపెట్టుకోవడం, షూలలో దాచిపెట్టుకోవడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎంత కష్టపడినా చివరికి కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోతారు. ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు సినిమాని తలపించేలా విధంగా కొంత మంది వ్యక్తులు 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వజ్రాలను పార్సల్ చేసి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న ప్లాన్ రివర్స్ కొట్టి ఎయిర్ పోర్టు అధికారులకు అడ్డంగా దొరికి పోయారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వజ్రాభరణాలు, బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబైకి తరలించేందుకు కొంత మంది కొరియర్ లాగా విమానాశ్రయానికి తరలించారు. అయితే వారి పన్నాగాన్ని కనిపెట్టిన కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా బంగారాన్ని, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందం అధ్వర్యంలో ఈ ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్ కార్గోలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీ ఎత్తున బంగారం, డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా ఎయిర్ పోర్ట్‌లోని ఎయిర్ కార్గోలో ఈ రవాణా జరుగుతోందని డిప్యూటీ కమిషనర్‌ అధికారుల బృందానికి సమాచారం అందింది. దీంతో వారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కొరియర్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని తెరచి చూడగా అందులో ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. అయితే అధికారులు డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద తూనికలు కొలతలు వెయిట్‌ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. ముంబై వెళుతున్న పార్సెల్‌లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీలు గుర్తించారు. వజ్రాభరణాలుకి పైనుంచి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. వీటి విలువ 30 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని అంచనా వేసారు. ఈ పార్సిల్‌ని శ్రీపాల్ జైన్ అనే వ్యక్తి ముంబయి అడ్రస్‌కి పంపుతున్నట్టు ఉండగా అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ ఫ్రమ్ అడ్రస్ ఉండటం విశేషం.

Tags:    

Similar News