Hyderabad Rains: నగరంలో కురిసిన భారీ వర్షానికి మునిగిన ఫ్లైఓవర్..వైరల్ వీడియో
Hyderabad Rains: కొత్తగూడ..హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్‌పై ఏకంగా నడుముల్లోతు నీరు చేరిపోయింది. దీంతో ఫ్లై ఓవర్‌పై మధ్యలో ఉండిపోయిన వాహనదారులు ఎటూ వెళ్లలేక మధ్యలోనే చిక్కుకుపోయారు.
Hyderabad Rains: నగరంలో కురిసిన భారీ వర్షానికి మునిగిన ఫ్లైఓవర్..వైరల్ వీడియో
Hyderabad Rains: శుక్రవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అల్లకల్లోలం అయింది. రోడ్లపై నీళ్లు చేరిపోవడంతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఓ పక్క వర్షం.. కాళ్ల కింద వరద నీరు ఉన్నా.. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు గంటల పాటు స్తంభించిపోయారు.
ఒక మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొత్త గూడ, హఫీజ్ పేట్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరిపోయింది దీంతో కాలనీలు చెరువులను తలపించాయి.
ఇదిలా ఉండే భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొత్తగూడ..హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్‌పై ఏకంగా నడుముల్లోతు నీరు చేరిపోయింది. దీంతో ఫ్లై ఓవర్‌పై మధ్యలో ఉండిపోయిన వాహనదారులు ఎటూ వెళ్లలేక మధ్యలోనే చిక్కుకుపోయారు. దీనివల్ల ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శుక్రవారం రాత్రి మాదాపూర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హైటెక్ సిటీ నుంచి కెపిహెచ్‌పి మార్గంలోని ఫ్లైఓవర్‌పై సైతం నీళ్లు చేరిపోయాయి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడక్కడ చర్యలు చేపట్టారు. నీటిని తొలగించారు. దీనివల్ల తొందరగా వరద నీరు తగ్గిపోవడంతో వాహనదారులు కాస్త రిలాక్స్ అయ్యారు.