Mega Job Mela: నిరుద్యోగులకు అండగా హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్

Mega Job Mela: జాబ్ కనెక్ట్ పేరుతో ప్రైవేట్‌ ఉద్యోగాలు కల్పిస్తున్న పోలీసులు * హైదరాబాద్‌ నాంపల్లిలో మెగా జాబ్‌మేళా

Update: 2021-07-25 06:20 GMT
హైదరాబాద్ నాంపల్లిలో మెగా జాబ్ మేళ (ఫైల్ ఇమేజ్)

Mega Job Mela: నిరుద్యోగ యువత కోసం హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాబ్ కనెక్ట్ పేరుతో నిరుద్యోగులకు అండగా ఉంటున్నారు. జాబ్‌ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరీ హైదరాబాద్‌లో మెగా జాబ్‌ కనెక్ట్‌ ఎక్కడ జరుగుతోంది. నిర్వాహకులను ఎలా అప్రోచ్‌ అవ్వాలి. ఏయే కంపెనీలు జాబ్స్ ఆఫర్స్ ఇస్తున్నాయి. 

పోలీసులంటే రక్షణగా ఉంటారు. కానీ హైదరాబాద్‌ పోలీసులు మాత్రం భద్రతతో పాటుభరోసా కూడా ఇస్తున్నారు.నిరుద్యోగ యువతకు దారి చూపుతూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. జాబ్‌కనెక్ట్ పేరుతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు కంపెనీలతో టీఎమ్ఐ ప్రతినిధులు చర్చించి ఉద్యోగ సోర్సెస్‌ గురించి పోలీసుశాఖకు తెలియజేస్తున్నారు.

నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరైన తర్వాత పోలీసులు వారి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. పదో తరగతి నుంచి పీజీ విద్యార్థుల అర్హతలను బట్టి ఉద్యోగాల ఆఫర్ ఇస్తారు. ఇలా ఒక్కో జాబ్‌ మేళాలో 25 కంపెనీల వరకు పాల్గొంటున్నాయి. నాంపల్లిలో నిర్వహించిన మెగా జాబ్‌మేళను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ మేళాలో 24 కంపెనీలు ముందుకువచ్చాయి.

ఇలా ఇప్పటి వరకు దాదాపు 18వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. యువతకు పోలీసులు భరోసా కల్పించడం సంతోషకరమైన విషయమని పారిశ్రామికవేత్త ఉమా చిగురుపాటి అన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యువతకు సరైన టైంలో కరెక్ట్‌ రూట్‌ను చూపిస్తే.. సక్రమంగా నడుచుకుంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News