Hyderabad: మరీ ఇంత రీల్స్ పిచ్చా? రీల్స్ క్రేజ్‌తో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Hyderabad: తాజాగా హైదరాబాద్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చిలో పడి ఒక యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు.
Hyderabad: మరీ ఇంత రీల్స్ పిచ్చా? రీల్స్ క్రేజ్‌తో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Hyderabad: ఈ మధ్య చాలామందికి రీల్స్ పిచ్చి మరింత ముదిరిపోతుంది. ఈ రీల్స్ మోజులో పడి చుట్టు ఏం జరుగుతుంది? అసలు ఎక్కడ ఈ రీల్స్ తీసుకుంటున్నామో తెలియకుండా మరీ వ్యవహరిస్తున్నారు. చివరకు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చిలో పడి ఒక యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు.
రీల్స్ వెర్రి అంతకంతకు పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ రీల్స్ వెనకాల పడుతున్నారు. లైక్స్, షేర్స్, ఫాలోవర్స్.. ఇవే వారిని పిచ్చిలో పడేస్తున్నాయి. తాజాగా రీల్స్ చేసేందుకు వెళ్లిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్ధి క్వారీలో పడి మృతి చెందాడు. బోరబండకు చెందిన 17ఏళ్ల మిర్జా షోయబ్ బేగ్ తన ఫ్రెండ్స్ తో కలిసి మానస హిల్స్ వద్ద ఉన్న క్యారీలకు వెళ్లాడు. అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు రీల్స్ తీయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో షోయబ్ కంగారుపడి నీటిలో పడిపోయాడు. స్నేహితులు అతన్ని కాపాడుదాం అనుకున్నా.. అది పెద్ద నీటి గొయ్యి. ఎవరి అందులో దిగడానికి సాహసించలేకపోయారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటున ప్రమాద స్థలానికి వచ్చినా ఫలితం దక్కలేదు. కాసేపు నీటిలో వెతికిన తర్వాత షోయబ్ శవమై తేలాడు. మృతదేహాన్ని నీటిలోంచి బయటకు తీసి, పోస్ట్ మార్టంకి పంపారు.
ఇదిలాఉంటే అసలు తల్లిదండ్రులకు షోయబ్ క్వారీల దగ్గరకు వచ్చినట్లు తెలియదు. ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి తన కొడుకు ఇలా శవమై తిరిగివచ్చాడని అతని తల్లిదండ్రులు తీవ్రంగా రోధించారు.