Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో 4 కోట్ల బంగారం సీజ్
Hyderabad: గోల్డ్ స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారాన్ని తరలిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో 4 కోట్ల బంగారం సీజ్
Hyderabad: గోల్డ్ స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారాన్ని తరలిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ కంప్రెషర్ మిషన్‌లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను ఎయిర్‌పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం మూడు కేసుల్లో నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 4కోట్ల రూపాయల విలువచేసే 7 కిలోల, 690 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు..అరెస్ట్ చేసిన నలుగురు ప్రయాణికులను విచారిస్తున్నారు.