కృష్ణాజిల్లా గుడివాడలో పొలిటికల్‌ హీట్‌.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపు

Gudivada: వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపు

Update: 2024-01-18 03:42 GMT

కృష్ణాజిల్లా గుడివాడలో పొలిటికల్‌ హీట్‌.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపు

Gudivada: కృష్ణాజిల్లా గుడివాడలో పొలిటికల్‌ హీట్‌ రాజుకుంది. ఇవాళ దివంగత ఎన్టీఆర్‌ వర్ధంతి నేపథ్యంలో.. అధికార వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా.. మధ్యాహ్నం 2 గంటలకు నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు చంద్రబాబు దంపతులు. అనంతరం.. సాయంత్రం 4 గంటలకు గుడివాడ మల్లాయపాలెంలో రా.. కదలిరా..! సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు.. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కొడాలి నాని. అధికార, ప్రతిపక్షాల కార్యక్రమాలతో గుడివాడ మొత్తం ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో నిండిపోయింది. టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. పోటీపోటీ కార్యక్రమాలు ఉండడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠకు తెరలేచింది.

Tags:    

Similar News