Narsapur: నర్సాపూర్‌లో పూలే జయంతి వేడుకలు: బీసీ భవన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!
Narsapur: నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగుల సంఘం (TBCUS) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Narsapur: నర్సాపూర్‌లో పూలే జయంతి వేడుకలు: బీసీ భవన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!
Narsapur: నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి లోని డివిజన్ bc ఉద్యోగుల సంఘం''''(TBCUS ) డివిజన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాఫూలే గారి 199 సంస్మరణ,, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుK. శేష చారి, పాల్గొని సామాజిక సమానత్వం కోసం,, వెనుకబడిన జాతుల అభివృద్ధి, కోసం స్త్రీ విద్య, స్త్రీ సమానత్వం, బహుజన వర్గాల సాధికారత కోసం, అభివృద్ధి కోసం, జ్యోతిబాపూలే ఆశయాలు నేటి కి ఎందరికో స్ఫూర్తివంతంగా నిలిచాయని ఆయన బాటలోనే నిన్న వర్గ, దళిత, వెనుకబడిన సామాజిక వర్గాల అభివృద్ధి, సాధికారత, సమానత్వం కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ డివిజన్ అధ్యక్షులు D. ప్రసన్న కుమార్, మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగిస్తూ, బీసీ ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులు సాధించుకొని, నర్సాపూర్ డివిజన్ నందు bc ఉద్యోగ భవన్ నిర్మాణం కోసం, మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి E. వెంకటకృష్ణ, జిల్లా బాధ్యులు N. నరేందర్ గౌడ్, భవానీ ప్రసాద్, మల్లేశం, డివిజన్ బాధ్యులు సంతోష్ కుమార్, రవికుమార్, పండరి, కృష్ణమూర్తి,
శ్రీనివాసరావు, గోపాల్ పాల్గొని జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగించాలని, బిసి ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు.