Nalgonda: నల్లగొండలో పూలే 200వ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన అడిషనల్ కలెక్టర్

Nalgonda: నల్లగొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-04-11 06:05 GMT

Nalgonda: నల్లగొండలో పూలే 200వ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన అడిషనల్ కలెక్టర్

Nalgonda: జ్యోతిరావు పూలేకు ఘన నివాళి సామాజిక విప్లవకారుడు, మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను నల్లగొండ పట్టణం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్ది తో కలిసి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

​అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని వారు కొనియాడారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు ఆయన చూపిన బాట నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News