కేసీఆర్ వరం ఎవరికి? మళ్లీ ఆశావహుల్లో హుషారు

Rajya Sabha Seats: పెద్దల సభకు ఖాళీ అయిన మూడు స్థానాలు మాకంటే మాకని టీఆర్ఎస్‌ నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు.

Update: 2022-05-12 14:00 GMT

కేసీఆర్ వరం ఎవరికి? మళ్లీ ఆశావహుల్లో హుషారు

Rajya Sabha Seats: పెద్దల సభకు ఖాళీ అయిన మూడు స్థానాలు మాకంటే మాకని టీఆర్ఎస్‌ నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. పెద్దల సభకు వెళ్లేందుకు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గులాబీ పార్టీలో ఇప్పుడు రాజ్యసభ సీట్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. గులాబి బాస్ ఎవరికి అవకాశం ఇస్తారన్నదానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఖాళీగా 3 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

రాజ్యసభకు రాజీనామా చేసిన బండ ప్రకాష్ ముదిరాజ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతోపాటు జూన్‌తో ముగియనున్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్ స్థానంలో రెండు సీట్ల కోసం పార్టీలో డజనుకుపైగా నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఐతే బండ ప్రకాష్ స్థానంలో ఎంపిక చేసే వ్యక్తికి రెండున్నరేళ్లు మాత్రమే అవకాశం లభించనుంది.

Tags:    

Similar News