Weather Update: రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

Weather Update: భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం * లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

Update: 2021-07-23 02:32 GMT
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 23 సెంటిమీటర్లు వర్షపాతం నమోదయిందని, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రం మీద కమ్ముకున్న మేఘం కొన్నిచోట్ల భారీగా కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. మరోవైపు వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. రోజంతా ముసురు విడవకుండా పడుతూనే ఉంది. దీంతో గ్రామాలు, బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహదారులు ఇబ్బందులు పడ్డారు.

Tags:    

Similar News