Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన వాహనాలు

Hyderabad: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

Update: 2022-10-13 01:12 GMT

Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన వాహనాలు

Hyderabad: హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉరుములు, మెరుపులతో జడివాన నగర ప్రజానీకాన్ని దడపుట్టించింది. నివాసిత ప్రాంతాల్లోని అపార్టుమెంట్లల్లో సెల్లార్లలోకి వరద దూసుకొచ్చింది. బోరబండ, సంజీవరెడ్డినగర్, క్రిష్ణానగర్ పరిసరాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. వరద ప్రవాహధాటికి రోడ్లపై పార్క్‌చేసిన ఆటోలు, మోటారుసైకిళ్లు, కార్లు కొట్టుకెళ్లాయి. కుండపోత వర్షంతో సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసరాలను కుండపోతవర్షం ముంచెత్తింది. సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట,పంజాగుట్ట పరిసరాల్లో భారీ వర్షం కురిసింది.

ఎడతెరపిలేని వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పటాన్‌చెరువు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్ పరిసరాలను జడివాన హోరెత్తించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపులా కిలో మీటర్‌ మేర వాహనాలు ఆగిపోయాయి.

కూకట్ పల్లి హౌజింగ్ బోర్డుకాలనీ, నిజాంపేట, ప్రగతినగర్‌, హైదర్‌నగర్ పరిసరాల్లో జోరువాన ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెట్టించింది.

బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లముందు పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయేలా వరద వచ్చింది. రహమత్ నగర్, బోరబండలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలో ఇళ్లలోకి నీరు చేరింది.

ఎర్రగడ్డ, మూసాపేట, బాలానగర్, బోయిన్‌పల్లి పరిసరాల్లోనూ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్రవాహనదారులు, మోటారు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, ప్యాట్నీ పరిసరాల్లోనూ ఎడతెరపిలేని వానతో ప్రయాణికులు సతమతమయ్యాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకోడానికి ఇబ్బందులు పడ్డారు.

కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, లక్డీకపూల్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిసరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. లక్డీ కపూల్‌నుంచి కోఠీకి వెళ్లేవాళ్లు, మలక్‌పేట, కోఠీ ప్రాంతాలనుంచి పంజాగుట్ట, మెహిదీ పట్నం వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్‌ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్ శివారులోని జంట జలశయాలు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 952 క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసిలో విడుదల చేశారు. హిమాయత్‌ సాగర్‌కు ఇన్‌ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉంది. రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కులను మూసిలోకి వదిలేందుకు చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News