Hyderabad Rains: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ప్రధాన రహదారులు జలమయం

Hyderabad Rains: వరద నీటిని తొలగించేందుకు జిహెచ్ఎంసి సిబ్బంది

Update: 2023-06-25 01:50 GMT

Hyderabad Rains:హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ప్రధాన రహదారులు జలమయం

Hyderabad Rains: వాతావరణంలో మార్పులతో హైదరాబాద్ నగరంలోనూ, పరిసరాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా చేరిన వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరద నీటిని తొలగించేందుకు జిహెచ్ఎంసి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ఎవ్వరూ బయటకు వెళ్లొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే బయటకు వెళ్లొద్దని నగరవాసులకు సూచించారు.

Tags:    

Similar News