Karimnagar: గాయపడ్డ పాముకు వైద్యం
Karimnagar: జంతుసంరక్షణ సంస్థకు సమాచారమిచ్చిన స్థానికులు
Karimnagar: గాయపడ్డ పాముకు వైద్యం
Karimnagar: గాయపడ్డ ఓ పాముకు కరీంనగర్ జిల్లా వెటర్నరి డాక్టర్లు వైద్యం అందించారు. కరీంనగర్ కమాన్ చౌరస్తా సమీపంలో గాయపడిన ఓ పాము కనబడింది. దీంతో స్థానికులు లక్ష్మి జంతు సంరక్షణ సంస్థకు సమాచారం ఇచ్చారు. అనంతరం పామును జిల్లా ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గాయపడిన చోట పాముకు కుట్లు వేశారు. గాయం తగ్గేదాక పాముకు జంతుసంరక్షణశాలలో అవాసం కల్పిస్తామని...అనంతరం అడవిలో విడిచిపెడతామని నిర్వాహకులు తెలిపారు.