తొగుటలో వేగంగా పంట కొనుగోళ్లు: రైతులకు భరోసా కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి పరిశీలించారు.
తొగుటలో వేగంగా పంట కొనుగోళ్లు: రైతులకు భరోసా కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్
తొగుట (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గత నెల 21 న ప్రారంభమైన రోజు నుండి పొద్దుతిరుగుడు పంట 278 మంది రైతుల దగ్గర 7180 బస్తాలు,3590 క్వింటాలు సేకరించడం జరిగిందన్నారు.అదేవిధంగా మక్కజొన్న పంట 25 మంది రైతుల నుండి 2333 బస్తాలు, 1166.50 క్వింటాలు సేకరించడం జరిగిందని అన్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్ డీఎం వి.సునీత తో మాట్లాడి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని కోరారు.రైతులు ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని సిద్దిపేట జిల్లాలోనే తొగుట మార్కెట్ పొద్దుతిరుగుడు కొనుగోలులో రెండో స్థానంలో వుందని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని చివరి గింజ వరకు కొనుగోలు జరుపుతామని కొద్దిగా ఓపిక పట్టాలని రైతులను కోరారు.