Dubbaka: అహ్మద్ నగర్‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన

Dubbaka: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో పర్యటించారు.

Update: 2026-04-10 06:34 GMT

Dubbaka: అహ్మద్ నగర్‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన

Dubbaka: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని అహ్మద్ నగర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం గ్రామంలోని CC డ్రైనేజ్, పాఠశాల ప్రహరీ గోడ మరియు అంగన్వాడి భవనాన్ని పరిశీలించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.

అలాగే అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామపంచాయతీ భవనం పనులను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారితో ఫోన్‌లో మాట్లాడి, భవనం పూర్తి చేయడానికి అదనంగా రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News