Khammam: ఖమ్మం రైల్వే కష్టాలకు మోక్షం.. ఢిల్లీలో ఎంపీ రఘురాం రెడ్డి కీలక భేటీ!

Khammam: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఢిల్లీలో రైల్వే ఈడీ వికాస్ కుమార్ జైన్‌తో భేటీ అయ్యారు.

Update: 2026-04-10 06:05 GMT

Khammam: ఖమ్మం రైల్వే కష్టాలకు మోక్షం.. ఢిల్లీలో ఎంపీ రఘురాం రెడ్డి కీలక భేటీ!

న్యూఢిల్లీ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, రైల్వే బోర్డ్ చైర్మన్, సికింద్రాబాద్ రైల్వే జీఎంలను కలిసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) వికాస్ కుమార్ జైన్ ను కలిసి కీలక సమస్యలను వివరించారు. కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల పెంపుపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన లభించిందని ఎంపీ తెలిపారు.

ప్రత్యామ్నాయ రైల్వే లైన్లు చేపట్టాల్సిందే..

పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీదుగా వెళ్ళనున్న డోర్నకల్ - మిర్యాలగూడ, డోర్నకల్ - గద్వాల రీ అలైన్మెంట్ల కోసం గతంలో పలు విజ్ఞాపనలు చేశామని, రైల్వే అధికారులు సర్వే కూడా పూర్తి చేశారని గుర్తు చేశారు. సానుకూల స్పందన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వెన్నారం, కురవి, అబ్బాయిపాలెం, మరిపెడ, మోతె మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. ఇందుకోసం వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ నుంచి న్యూ గొల్లగూడెం మీదుగా జాతీయ రహదారి అంశం ప్రస్తావన, భూ మార్పిడి పై విన్నపం

రోడ్డు విస్తరణకు కొత్తగూడెం (బీడీసీఆర్) స్టేషన్ వద్ద 4,556 చ.మీ. (5,449 చదరపు గజాలు) రైల్వే భూమి అవసరమని, ఈ భూమికి బదులుగా ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద 9,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వేకు ఇచ్చేందుకు సిద్ధమని వివరించారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్ల నుంచి దక్షిణ మధ్య రైల్వేకు 2025, నవం బర్ 14న ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.

Tags:    

Similar News