Atmakur: గిరిజన ఆడపడుచులకు అండగా సాంబశివ చారిటబుల్ ట్రస్ట్
Atmakur: ఆత్మకూరులో గిరిజన వధువుకు సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అండ. రూ. 10,116 నగదు, పట్టు వస్త్రాల పంపిణీ.
Atmakur: గిరిజన ఆడపడుచులకు అండగా సాంబశివ చారిటబుల్ ట్రస్ట్
Atmakur: సంగం మండలం వీర్లగుడిపాడు గిరిజన కాలనీకి చెందిన పేద కుటుంబంలోని గిరిజన వధువు సోమ మహి వివాహానికి ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి అండగా నిలిచారు.పెళ్లి కానుక' పథకం కింద రూ. 10,116/- నగదు చెక్కును, వధూవరులకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్బంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు అవగాహన కల్పించి, బాల్య వివాహాలను అరికట్టడమే ఈ 'పెండ్లి కానుక' పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
నిజమైన పేద కుటుంబాలకు తమ ట్రస్ట్ ద్వారా 'పెండ్లి కానుక' అందజేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అంతేకాక చదువు ప్రాముఖ్యతను ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరించారు.ఒక చేపలు పట్టే వ్యక్తి దగ్గర రథం (విజయం) ఉంటే, అది మిగతా వారికి ఎలా స్ఫూర్తినిస్తుందో.. అలాగే ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకొని ఉద్యోగం సాధిస్తే, మిగతా 99 మంది పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలని, అప్పుడే కుటుంబ పరిస్థితులు మారి అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు.