Revanth Reddy: రేపటి నుండి హాత్‌ సే హాత్ జోడో అభియాన్ యాత్ర

Revanth Reddy: యాత్రను ప్రారంభించనున్న మాణిక్‌రావు ఠాక్రే

Update: 2023-02-05 13:00 GMT

Revanth Reddy: రేపటి నుండి హాత్‌ సే హాత్ జోడో అభియాన్ యాత్ర 

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్‌ పాదయాత్ర రేపు మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయ 11 గంటలకు మేడారం సమ్మక్క, సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ప్రారంభిస్తారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్టు నగర్, పస్రా, రామప్ప గ్రామం వరకు తొలిరోజు పాదయాత్ర జరుపుతారు. పస్రాలో సాయంత్రం కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. 

Tags:    

Similar News