Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు… ప్రధాని మోదీ సహా ప్రముఖులు అభినందనలు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Update: 2025-11-08 06:00 GMT

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు… ప్రధాని మోదీ సహా ప్రముఖులు అభినందనలు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ, రేవంత్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్సును కోరారు.

ప్రధానమంత్రి మోదీతో పాటు పలు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా సీఎం రేవంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వంటి ప్రముఖులు రేవంత్ రెడ్డికి ఆరోగ్యం, దీర్ఘాయుష్సుతో రాష్ట్ర సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

కేంద్ర మంత్రి మరియు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “ఆ అమ్మవారి దయ, దీవెనలు ఎల్లవేళలా రేవంత్ రెడ్డితో ఉండాలని, నిండు నూరేళ్లు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని” కోరారు.

ఇలా రాజకీయాలకు పైగా, వివిధ ప్రముఖులు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా, పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News