Tamilisai: గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది
Tamilisai: నియంతృత్వ ధోరణితో ప్రవర్తించడాన్ని ప్రజలు సహించలేదు
Tamilisai: గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది
Tamilisai: గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో గత పదేళ్ల పాలనలో పాలకులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. నియంతృత్వ ధోరణితో ప్రవర్తించడాన్ని ప్రజలు సహించలేదని అన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ బద్ధ సంస్థలను మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామన్నారు గవర్నర్. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని అన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.