తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిపై సంచలన వ్యాఖ్యలు

Tamilisai Soundararajan: వరద ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాన్ని ప్రస్తావించిన తమిళిసై

Update: 2022-10-21 04:15 GMT

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిపై సంచలన వ్యాఖ్యలు

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏర్పడిన వరద ప్రాంతాల్లో తాను పర్యటిస్తున్నట్లు టీవీల్లో స్క్రోలింగ్ రాగానే.. ముఖ్యమంత్రి వరద ప్రాంతాలకు బయలుదేరే వారని తమిళిసై అన్నారు. తాను గవర్నర్‌గా విధులు నిర్వర్తించిన రాష్ట్రాల్లో ప్రజల కోసం ముఖ్యమంత్రులను కూడా క్షేత్రస్థాయికి రప్పించిన ఘనత తనకుందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకుని... నాలుగో సంవత్సరంలో పని ప్రారంభించానన్నారు. తన మూడో సంవత్సర ప్రయాణంలో నిస్వార్థ సేవలో ఆత్మను కనుగొనడం పుస్తకాన్ని చెన్నయ్‌లో విడుదల చేశారామె..... ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడారు.

చెన్నయ్‌లో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ కలకలం రేపుతున్నాయి. మునుగోడు ఎన్నికల వేళ గవర్నర్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమిళిసై... తెలంగాణలో తన పనితీరు... ప్రజల కోసం చేసే కార్యకలాపాల గురించి వచ్చిన విమర్శలపై కూడా ప్రస్తావించారు. 

Full View
Tags:    

Similar News